గాయాలపాలైన ద్విచక్ర వాహనదారులు

నెల్లూరు జిల్లాలోని మనుబోలు దగ్గరగా నున్న కొమ్మలపూడి జాతీయ రహదారిపై నెల్లూరు వైపుఅధిక లోడుతో వెళుతున్న ఆటో  అదుపుతప్పి బోల్తా పడింది . వెనుక వైపు నుండి ద్విచక్ర వాహనంలో వేగంగా వస్తున్న నెల్లూరు మాగుంట లేఔట్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఆటోను  ఢీకొనడంతో గాయాల పాలయ్యారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆగడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు అంబులెన్స్ మరియు హైవే సిబ్బందికి తెలియజేయడం జరిగింది.