నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం లో పేదలందరికీ ఇళ్లు పధకం లేఅవుట్ ను లబ్దిదారులు, అధికారులతో కలిసి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు.అవాస్తవాలను ప్రచురితం చేస్తున్న పత్రిక పై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూచాలా మంది పేద వారికి ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.కొంత మంది ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా నివాసం ఉంటున్న, వారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే వాటిని తొలగించమని చెప్పడం జరిగింది.ఆ ప్రకారమే ఈప్రాంతంలో పేదలందరికీ ఇళ్లు పంపిణీ చేసేందుకు లే-అవుట్ లో అభివృద్ధి పనులను ప్రారంభించారు.దీంతో లబ్ధిదారులు అందరూ సంతోష పడ్డారు.ఈ పరిస్థితుల్లో ఒక పత్రికలో అసత్యపు కథనాలు ప్రచురితం చేయడం బాధాకరం.ఆంధ్రజ్యోతి పత్రిక ఏ విధంగా నిజాలను వక్రీకరిస్తుందో అనేదానికి ఇదొక ఉదాహరణ.ఈ పత్రికకు విశ్వసనీయత ఏ మాత్రమైన ఉందా!.
ఈ పత్రికలు పేద ప్రజల కోసం పనిచేస్తుందా!, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తుందా …!
తెలుగుదేశం వాళ్లు అభివృద్ధిని చూడలేక, వారు చేసే అసత్య ప్రచారాలను పత్రికల్లో రాస్తారా అనేది పత్రిక యాజమాన్యం ఆలోచన చేయాలి.ఇటువంటి పత్రికల వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుంది.పత్రికలను, పాత్రికేయులను గౌరవిస్తాము, కానీ ఇటువంటి లేని పోనీ అసత్యాలను వ్రాయడం సమంజసం కాదు.కొంత మంది ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇతరులకు అమ్మడం, అవి కొందరు పాత్రికేయులకు అనుకూలంగా ఉన్న వారివి కావడంతో వాటిపై అసత్యాలు రాయించడం చేస్తున్నారుఇక్కడ కోట్లు విలువ చేసే స్థలాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బడాబాబుల కబంధ హస్తాల్లో ఉంటే వాటిని విడిపించి అర్హులైన పేదలకు ఇవ్వడం జరుగుతుంది.
గతంలో ఈ భూములను ఆక్రమించిన బడాబాబులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఆక్రమించిన స్థలాలు పేదలకు ఇస్తున్నారని కొంత మంది కోర్టులకు వెళ్లడం, అధికారులను బెదిరించడం చేస్తున్నారు.సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే “తాటాకు చప్పుళ్లకు బెదిరే మనిషి కాదు” అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.పేద వారికి చెందాల్సిన భూములను పేద వారికి చెందే విధంగా చేస్తాను.ఇటువంటి అసత్యపు వార్తలు, అబద్దపు ప్రచారాలను నమ్మవద్దు.తెలుగుదేశం వాళ్లకు అనుకూలంగా ఉండాలనుకుంటే, ఇటువంటి అసత్యాలను కాకుండా తెలుగుదేశం కరపత్రాలు పంపిణీ చేసుకోండి.. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.పత్రిక యాజమాన్యాలు ఇటువంటి దుష్ప్రచారాలు చేయడం సరైన పద్ధతి కాదు.పేద వారికి న్యాయం చేస్తామే తప్ప మరో ఆలోచన చేసేది ఉండదు.ఉగాదికి అర్హులైన పేదలందరికీ ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత నాది.ఎవరైనా దొంగ పట్టాలు తెస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.