గూడూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వైయస్సార్ బీమా జగనన్న తోడు పథకాలకు సంబంధించి తనిఖీ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్  రెడ్డి ఈ సందర్భంగా ఆయన ఈ పథకాలకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు... భీమా ప్రీమియం చెల్లింపులో ఎటువంటి జాప్యం ఉండకూడదన్నారు. జగనన్న తోడు కు సంబంధించి లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ , మెప్మా పిడి ఎస్ వి నాగేశ్వర రావు , డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ సాంబశివారెడ్డి , గూడూరు డివిజనల్ డీ యల్ డీవో సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో నాగమణి తదితరులు పాల్గొన్నారు..