సీమాంధ్ర బి.సి. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గూడూరు టౌన్ 2వ పట్టణ పరిదిలోని బి.సి. బాలికల వసతి గృహంనందుగల పూలే దంపతుల విగ్రహాలకు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వుల్లిపాయల శంకరయ్య హాస్టల్ అసిస్టెంట్ బి.సి. వెల్ ఫేర్ ఆఫీసర్ కె. సుధాకర్, వార్డన్ ఎస్ అన్నపూర్ణమ్మ, బి.సి. సంఘ నాయకులు హాస్టల్ సిబ్బంది హాస్టల్ విద్యార్ధినిలు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాలులు అర్పించారు. రాష్ట్ర అధ్యక్షులు వుల్లిపాయల శంకరయ్య మాట్లాడుతూ పూ దంపతులు వారి జీవిత కాలమంతయు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు జ్యోతిరావుపూలేగారు వారి సతీమణి సావిత్రిబాయి గారికి విద్యనేర్పించి మహిళల విద్యకోసం మహిళా పాఠశాలను ఏర్పాటు చేసి అందులో సావిత్రి బాయిపూలే ఉపాధ్యాయురాలుగా విద్యబోధించారు. సావిత్రిబాయి పూలేగారు భారతదేశ మొదటి మహిళా ఉపాద్యాయురాలని కొనియాడారు. బాలికలు అందరు ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను అభ్యసించాలని తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా పూలే దంపతుల విగ్రహాలను ప్రతి ప్రభుత్వ విద్యాలయాలలో ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పై కార్యక్రమంలో యం.మునిరత్నం, జి.బొయన్నయాదవ్, ఎన్.శ్రీనివాసులు,టి. గంగాదరం, ఎస్. బాను ప్రకాష్, యం. వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.