పొదలకూరు బాలుర ఉన్నత పాఠశాలలో....  ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు....ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమగ్రశిక్షా అభియాన్ ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భాషా దినోత్సవాల లో భాగంగా చివరి రోజైన గురువారం తెలుగుభాషా దినోత్సవాన్ని స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. సనత్ కుమార్ మాట్లాడుతూ మాతృభాష తెలుగు ను దేశభాషలందు తెలుగు లెస్స అనే  విధంగా విద్యార్థులు ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు . తెలుగు ఉపాధ్యాయులు వి.పి. ప్రసాద్ రెడ్డి ఎన్. సుజాత,వి. నాగేశ్వరి  విద్యార్థులకు పద్య, గద్య పోటీలను, వ్యాసరచన పోటీలను, నాటికలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.