రవి కిరణాలు న్యూస్ తడ:
శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నరు  గౌ” శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు దర్శించుకొన్నారు. వారిని ఆలయ ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మరియు కార్యనిర్వాహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి ఆలయ  మర్యాదలతో  పూర్ణకుంబ స్వాగతం పలుకుట జరిగినది. అనంతరం వేద పండితులచే శ్రీ అమ్మవారికి పూజలు నిర్వహించటమైనది, తదుపరి గవర్నరు గారికి శేష వస్త్రములు, ప్రసాదములు శ్రీ అమ్మవారి జ్ఞాపికను అందజేయుట జరిగినది. వేద పండితులచే వేదాఆశీర్వచనం జరిపించుట జరిగినది. ఈ కార్యక్రమములో శాసన మండలి సభ్యలు, వాకాటి నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్, MN హరేందిర ప్రసాద్, ASP, వెంకటరత్నం, RDO,పి. సరోజిని,  DSP, రాజగోపాల్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు గోగుల తిరుపాలు, కర్లపూడి మదన్ మోహన్, ముంగర అమరావతి, మద్దూరు శారద, కామిరెడ్డి రేవతి, పొన్న నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.