సూళ్లూరుపేట, జనవరి 07, (రవికిరణాలు) : సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు మంగళవారం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి మాట్లాడుతూ 30 పడకల నుండి 50 పడకల చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూస్తున్నారని ప్రజలందరికీ సకాలంలో వైద్యం అందించాలని హాస్పిటల్ లేని చోట హాస్పిటల్ కట్టించడం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీకి నాయకులు శేఖర్ రెడ్డి,గోగుల తిరుపాల్,తుపాకుల ప్రసాద్,గోపిరెడ్డి,జెట్టి వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.