సూళ్ళూరుపేటలో ఘనంగా గోదాదేవి తిరు కళ్యాణ మహోత్సవ వేడుకలు


ప్రజలందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.మమత ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దీవి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో శ్రీ గోదాదేవి కళ్యాణం. ఉభయ కర్తలుగా వ్యవహరించిన శ్రీ యర్రగుంట్ల సుధాకర్ రెడ్డి, శ్రీమతి అనూష, నెల్లూరు.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో వెలసివున్న శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ గోదాదేవి కల్యాణం మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రోచ్ఛారణలతో వేదపండితుల మధ్య ఉభయ దాతలు చేతుల మీదుగా సాంప్రదాయ పూజలు నిర్వహించి గోదాదేవి, రంగనాయకుని ఎదురుగా నిలబెట్టి పూలమాల వేసి అనంతరం ఒకటి చేశారు. జీలకర్ర బెల్లం పెట్టి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో బాలాంజనేయ స్వామి భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.