ఎస్సీ, ఎస్టీ కేసులలో ముద్దాయిలపై చర్యలతో పాటు జాప్యం లేకుండా ఫైనలైజ్ చేయాలి 
ఈ రోజు స్పందనకు జిల్లా వ్యాప్తంగా 80 పిర్యాదులు
నెల్లూరు, జనవరి 06, (రవికిరణాలు) :"స్పందన” కార్యక్రమంనకు అందిన పిర్యాదులను నిర్దేశించిన గడువు లోగా పరిష్కరించాలని జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న "స్పందనను” వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ లైవ్ లో పర్యవేక్షిస్తూ సంబందిత పోలీసు అధికారులకు తగు ఆదేశాలు జారీచేశారు.వచ్చిన ఫిర్యాదులలో భూతగాదాలు, భార్యా భర్తల మరియు కుటుంబ గొడవల కేసులు, చోరీ సొత్తు రికవరీ, ప్రేమ వివాహం చేసుకొని రక్షణ కావాలని మొదలగు కేసులు ఎక్కువగా ఉన్నాయి. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా యస్పి సంబంధిత అధికారులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఎస్సీ/ఎస్టీ కేసులలో ముద్దాయిలపై
చర్యలతో పాటు జాప్యం లేకుండా ఫైనలైజ్ చేయాలి అని, ఐటి యాక్ట్ చట్టాన్ని దర్యాప్తు అధికారులు ఆయా కేసులలో ప్రభావవంతంగా ఉపయోగించాలని, ఈ రోజు అందిన పిర్యాదులను చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి మొత్తం 70 మంది ఫిర్యాదుదారులు జిల్లా యస్పి వద్దకు రాగా, మిగిలిన ఐదు సబ్ డివిజన్ లలో అందిన మరో 10 పిర్యాదులతో కలిపి మొత్తం 80 స్పందన పిటిషన్ లు జిల్లా వ్యాప్తంగా స్వీకరించబడినవి. స్పందన కార్యక్రమానికి యస్పి తో పాటు అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) పి.మనోహర్ రావు, నెల్లూరు రూరల్ డియస్పి కె.వి.రాఘవ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్-డియస్పి లక్ష్మీనారాయణ, యస్.బి డియస్పి యస్.కోటారెడ్డి హాజరుగా ఉన్నారు.