మంగళవారం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సందర్శించారు. 5వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ పనులను దేవస్థానం చైర్మన్ సభ్యులతో కలిసి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ముప్పవరపు ఉషమ్మ చొరవతో 48 లక్షలతో కూడిన గిరిప్రదక్షిణ రోడ్డును ప్రారంభోత్సవం పనులను పరిశీలిస్తూ ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఉండాలని దేవస్థానం ఈ.ఓ., చైర్మన్, సభ్యుల్నికోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోరారు.