నెల్లూరు, జనవరి 08, (రవికిరణాలు) : దేవరపాలెం, కొమ్మరపూడి, కొండ్లపూడి గ్రామాలలో 2 కోట్ల 65 లక్షల రూపాయలనిధులతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసారు. కాలివేలపాలెం, పెనుబర్తి, మదరాజుగూడూరు, కాకుపల్లి గ్రామాలలో 2 కోట్ల 70 లక్షల రూపాయలనిధులతో అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. రూరల్ ఎమ్మెల్యే ఒకేరోజు 7 గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. నెల్లూరు రూరల్ మండలంలో 17 గ్రామాలలో 55 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.