నెల్లూరు, జనవరి 06, (రవికిరణాలు) : దొంతాలి, ఆమంచర్ల, సౌత్ మోపూరు గ్రామాలలో 5 కోట్ల 25 లక్షల రూపాయలనిధులతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేశారు. కందమూరు, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి గ్రామాలలో 1 కోటి 93 లక్షల రూపాయలనిధులతో అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసారు. రూరల్ ఎమ్మెల్యే ఒకేరోజు 9 గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. నెల్లూరు రూరల్ మండలంలో 17 గ్రామాలలో 55 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రూరల్ ఎమ్మెల్యే తెలియజేశారు. పై కార్యక్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.