నెల్లూరు, పిబ్రవరి 06, (రవికిరణాలు) : మాజీ శాసనసభ్యులు బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి అనారోగ్యం రిత్య మరణించడం కలచివేసింది. ఆయన 1978,85,89లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన సమాజానికి చేసిన సేవలు, నియోజకవర్గం అభివృద్ధికి అందించిన కృషి ఎనలేనిది. స్వతహాగా వైద్య వృత్తికి చెందిన ఆయన ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. అలాంటి మంచి వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు పలువురు నాయకులు, అధికారులు ప్రగాఢ సానుభూతిని
తెలియజేశారు.