నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్‌ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు.భానుశ్రీ పార్టీలో చేరడం అభినందనీయం, ఆమెకు ఉన్నత స్థాయి పదవిని స్థానిక మంత్రి అనీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కల్పిస్తారని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజల ఇంటికే సంక్షేమ పధకాలు వచ్చే విదంగా ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. త్వరలో కార్పోరేషన్ ఎన్నికలు రానున్నాయని, వాటిలో రూరల్, 
సిటిలోని మొత్తం స్థానాలు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఇరిగేషన్ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తెలిపారు. భానుశ్రీ గౌరవం ఏ మాత్రం తగ్గకుండా చూస్తామని ఆమె సూచనలు, సలహాలు తీసుకుంటూ, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ముందుకు వెళ్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారని భానుశ్రీ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఛైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.