హైదరాబాద్, జనవరి 26, (రవికిరణాలు) : టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పరామర్శించారు.
గుండెకు స్టంట్ వేయడంతో హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్న సోమిరెడ్డిని కలిసి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు..
సోమిరెడ్డిని పరామర్శించిన వారిలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు జిల్లా నేతలు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, గూటూరు మురళీకన్నబాబు తదితరులు ఉన్నారు.