చెడిపోయిన బోరింగు ను రిపేరు చేయించి త్రాగునీటి సమస్య తీర్చండి 

 సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డిఓ గారికి వినతిపత్రం ఇచ్చిన కాలనీవాసులు 


 శివరామ సుబ్బయ్య కాలనిలో చెడిపోయి ఉన్న పోరును బాగు చేయించి నీటి సమస్యను తీర్చాలని కోరుతూ సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ గత 20 సం"నుండి  శివరామ సుబ్బయ్య కాలనిలో సుమారు 50 నిరుపేద కుటుంబాలు నివాసం ఉంటున్నారని అక్కడ వారికి అన్ని వసతులు లేనప్పటికి వారు కూలీపనులు చేసుకొని అక్కడ నివాసముంటు జీవనం సాగిస్తున్నారు. ఆ కాలనీలో ఉన్న చేతిబోరు చెడిపోయి కొన్ని నెలలు గడిచినప్పటికీ మున్సిపల్ అధికారులకు చెడిపోయిన బోరును రిపేరు చేయించి త్రాగునీటి సమస్యను తీర్చాలని ఎన్ని సార్లు తెలుపుకున్నప్పటికి ఇప్పటికి నీటి సమస్యను పరిష్కరించ కాలేదని అన్నారు. ఇప్పటికైనా ఆర్డిఓ స్పందించి చెడిపోయిఉన్న బోరును వెంటనే బాగు చేయించి నీటి సమస్యను తీర్చాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో వెంకటరత్న, Y కట్ట మరియమ్మ ,నాగులరి సుబ్బమ్మ , బుజ్జమ్మ , మల్యద్రి N. వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.