కోట మండలం కొత్తపట్నం పంచాయితీ పరిధిలో నిర్మించనున్న పరిశ్రమ కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు పరిహారాన్ని చెంల్లించే విషయంపై గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ ఎంతో కాలంగా తాము సాగుచేసుకుంటున్న భూముల్లో కోస్టల్ కారిడార్ కింద పరిశ్రమలకు కేటాయించారని అయితే అక్కడున్న సుమారు 370 ఎకరాల భూములకు గాను కేవలం 70 ఎకరాలకు మాత్రమే పరిహారాన్ని అందించారన్నారు. మిగిలిన రైతుకు కుడా పరిహారాన్ని అందించాలని అధికారులు, నాయకులు చుట్టూ తిరుగున్నా వారు పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.