నెల్లూరు : తేది 29-02-2020 నుండి 01-03-2020 వరకు విజయవాడలో జరుగబోవు రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీలలో పాల్గొనబోయే నెల్లూరు జిల్లా స్త్రీ, పురుషుల కర్రసాము జట్ల ఎంపికలు తేది 05-02-2020న స్థానిక ఏసి సుబ్బారెడ్డి స్టేడియం నందు యం.సుస్మిత, ముఖ్యకార్య నిర్వహణ అధికారి, సెట్నల్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వారు ప్రారంభించారు. ఈ ఎంపికలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కర్రసాము క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఎంపికలలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను నెల్లూరు జిల్లా తరపున పైన తెలిపిన రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీలలో పాల్గొందురు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ ఆర్.కె. యతిరాజ్, క్రీడా శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.