తేది 08-03-2020 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోని వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు తేది 07-03-2020 న స్థానిక ఏ.సి. సుబ్బారెడ్డి స్టేడియం నందు జిల్లా స్థాయి అథ్లెటిక్స్, టెన్నికాయిట్ మరియు త్రోబాల్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను శ్రీమతి యం. సుస్మిత, ముఖ్యకార్యనిర్వహణ అధికారి, సెట్నల్ మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, నెల్లూరు వారు ప్రారంభించారు. పై కార్యక్రమంలో వివిధ శాఖలల నుండి షుమారు 100 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ పోటీలలో మొదటి మూడు స్థానాలలో గెలుపొందిన వారికి తేది 08-03-2020న శ్రీ కస్తూరిభాకళాక్షేత్రం నందు జరుగబోవు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధుల చేతుల మీదుగా బహుమతి ప్రధానము చేయబడును. పై కార్యక్రమంలో ఆర్.కె. యతిరాజ్, చీఫ్ కోచ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వారు, క్రీడా శిక్షకులు మొదలైనవారు పాల్గొన్నారు.