మర్రిపాడు, జనవరి 21, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలానికి చెందిన మాణం రమణమ్మ మర్రిపాడు గ్రామంలో జీవనం సాగిస్తుంది.. ఆమెకు ఎటువంటి సాయం అందలేదు...ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది... ఈ విషయాన్ని మర్రిపాడు మండలానికి చెందిన ఐక్య ఫౌండేషన్ సభ్యులు పౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణచౌదరికి తెలియజేయడంతో వెంటనే స్పందించి ఈరోజు గ్రామంలో ఐక్య ఫౌండేషన్ సభ్యుడు షేక్.షామీర్ జ్ఞాపకార్ధంగా ఆ వృద్ధురాలికి బియ్యం, నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐక్య పౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణచౌదరి మాట్లాడుతూ వృద్ధురాలికి ఆర్థిక పరిస్థితి సరి లేదని, ఏటువంటి అండ లేని వృద్ధులకు,ఐక్య ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు సహాయ సహకారలు అందిస్తున్నా పౌండేషన్ సభ్యులకు, మీడియా సహోదరులకు, మిత్రులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణచౌదరి, సాహిర్, శాఖ పురం సురేష్,శ్రీను,రమేష్, వెంకటరత్నం, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.