క్రీడల్లో మెరిసిన ఎమ్మెస్సార్ విద్యార్థినిలుఇటీవల నెల్లూరు డికెడబ్ల్యూ కళాశాలలో జరిగిన విక్రమ సింహపురి యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రీడా పోటీల్లో కావలి పట్టణంలోని ఎమ్మెస్సార్ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ఉత్తమ ప్రతిభ కనబరచి పలు పతకాలను సాధించారు. కళాశాల విద్యార్థినిలు షటిల్ సింగిల్స్, డబుల్స్ లో విన్నర్స్ గా, వాలీబాల్ టీం రన్నర్స్ గా, టేబుల్ టెన్నిస్ టీం రన్నర్స్ గా నిలిచి పతకాలను సాధించారు. ఈ సందర్భంగా గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తల్లపనేని ఉమ వాలీబాల్ టీం లోని విద్యార్థినిలు ప్రవల్లిక, భార్గవి, మేఘన, లక్ష్మీ ప్రసన్న, ప్రియాంక, ప్రేమ కుమారి, ప్రవీణ, మహాలక్ష్మి, పూజిత, ధనమ్మ, శిరీష లను, షటిల్ టీం లోని విద్యార్థినిలు ప్రవల్లిక, భార్గవి, హేమ లను, టేబుల్ టెన్నిస్ టీం లోని విద్యార్థిని హేమ ను ఈ సందర్భంగా అభినందించి స్వీట్లు పంచారు. వ్యాయామ ఉపాద్యాయుడు బ్రహ్మానందరెడ్డి ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాలలో ఉత్తమ విద్యను అందించడమే కాకుండా క్రీడల్లో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించి వారికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఒత్తిడి లేని విద్యనందిస్తూ, మానసికోల్లాసం కోసం క్రీడలు నిర్వహిస్తూ, కళాశాలలో ఆహ్లాదకర వాతావరణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ మందా సాంబశివయ్య, టి.కిరణ్, అన్నదాత మణి, మధుసూదన్ రావు, తదితరులు పాల్గొన్నారు.