నెల్లూరు, జనవరి 20, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామ పంచాయతీలోని అప్పయ్యకండ్రిగ గ్రామంలో 33కే.వి.ఎలక్ట్రిక్ సప్లై లైన్ పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంఖుస్థాపన చేసారు. ఆమంచర్ల, మన్నవరప్పాడు, అప్పయ్యకండ్రిగ, సిద్ధవరప్పాడు, మట్టెంపాడు మరియు దొంతాలి గ్రామాలకు విద్యుత్ అంతరాయం లేకుండా ఈ 33కే.వి.ఎలక్ట్రిక్ సప్లై లైన్ ఎంతో ఉపయోగపడుతుందని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు.