- రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్
నెల్లూరు, జనవరి 30, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని మూలాపేట నందు గల శ్రీకృష్ణ ధర్మరాజస్వామి ఆలయంలో పాలకవర్గ ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్ పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్ గా దువ్వూరు శైలేంద్ర, సభ్యులుగా గుడి మునివెంకట సుబ్రహ్మణ్యం, చెంగల్పట్టు నాగరాజు, గండికోట కామేశ్వరి, వై.సునీత, నెల్లూరు వినోద్ కుమార్, ముత్తరాజు పుట్టాప్రసాద్, చైనూరు సుధాకర్, పి.రమ్యలు ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతూ శ్రీకృష్ణ ధర్మరాజస్వామి ఆలయంలో పాలకవర్గ చైర్మన్, సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసినవారికి, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు.ఆలయ పాలకవర్గ సభ్యులుగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండ చూడాలని కోరుకుంటున్నానన్నారు. నెల్లూరు నగరంలో జనవరి నెలలోనే దాదాపు 5 దేవస్థానాలకు పాలకవర్గ సభ్యులను ఎంపిక చేసుకోవడం జరిగిందని, మిగిలిన ఆలయాల్లో కూడ త్వరలో
సభ్యులను నియమిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి పనిచేసిన వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పాలకవర్గ సభ్యులుగా ఎంపికైనవారు భక్తితో, చిత్తశుద్ధితో పని చేయాలని, భగవంతునికి సేవ చేసే అదృష్టం కలగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ సిపి నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి పి.రూప కుమార్ యాదవ్, గోగుల నాగరాజు, ఎ.జనార్దన్‌రెడ్డి, వడ్లమూడి చంద్ర, లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, నూనె మల్లికార్జునయాదవ్, శివపురం సురేష్, వేలూరు మహేష్, తదితరులు పాల్గొన్నారు.