సూళ్లూరుపేట, జనవరి 12, (రవికిరణాలు) : సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని కాళంగి నదీ తీరాన ఏటి పండుగకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 17, 18 తేదీలలో రెండు రోజులు పాటు ఏటి పండగ నిర్వహించనున్నారు పండుగ ఏర్పాట్లను ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి,సభ్యులు పరిశీలించారు  ఏటి పండగలో అమ్మణ్ణి భక్తులందరూ పాల్గొనాలని చైర్మన్ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి, ఈఓ శ్రీనివాసులు రెడ్డి, దబ్బల శ్రీమంత్ రెడ్డి,కళాత్తూరు రామ్మోహన్ రెడ్డి దొరవారిసత్రం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.