సూళ్లూరుపేట శాసన సభ్యులు , తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్య గారి ఆదేశాల మేరకు నాయుడుపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ కటకం దీపిక సూచన మేరకు 24 వ వార్డు కౌన్స్ లర్ దార రవి  తేదీ 27  సోమవారం వార్డు పర్యటించి న్నారు. పర్యటన లో వార్డు ప్రజలు వీధి దీపాలు ఎలగటం లేదని కౌన్స్ లర్ కి విన్నవించారు.  ఎక్కడ ఎలగటం లేదని పరిశీలించగా 5 కరెంట్ పోల్స్ అని గుర్తించి వెంటనే 5 లైట్లు ను  28 వ తేదీ మంగళవారం వార్డు లో ఏర్పాటు చేశారు. ఆయన వెంట రాఘవ రెడ్డి తదితరులు ఉన్నారు.