సూళ్లూరుపేట లో ఘనంగా డాక్టర్ లూయీ బ్రెయిలీ 213 జయంతి వేడుకలు.

నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-పట్టణంలో ని భవితా దివ్యాంగుల పాఠశాల నందు నేడు దివ్యాంగుల దేవుడు ఆశాజ్యోతి డాక్టర్ లూయీ బ్రెయిలీ 213 జయంతిని నేడు పట్టణంలో ని భవిత పాఠశాలనందు భవిత స్కూల్ టీచర్ భార్గవి మరియు ఎన్పీఆర్డి సేవా సంఘం దివ్యాంగులు కలిసి ఘనంగా నిర్వహించారు.ముందుగా MEO శ్రీ మస్తానయ్య ద్వారా  డాక్టర్ లూయీ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలువేసి నివాళులర్పించారు.అనంతరం ఎంఈఓ  బ్రెయిలీ  అందించిన బ్రెయిలీ లిపిని గురించి చాలా చక్కగా వివరించారు.దివ్యాంగులకు ఆపాఠశాల ఉపాద్యారాలు భార్గవి  ఆటల పోటీలు ,డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు.పోటీలలో గెలుపొందిన వారికి శాంత కుమారి  రెయిన్ కోట్ ను MEO  , బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గవర్నమెంట్ హై స్కూల్ హెచ్ఎం  ద్వారా బహుమతులుగా అందించారు.ఈ సందర్భంగా శ్రీమతి నాదెండ్ల శాంత కుమారి  బ్లైండ్ దివ్యాంగులకు దాతల ద్వారా 20మందికి దుప్పట్లు, అన్నదానము, స్వీట్లు ,పండ్లు బిస్కెట్లు పంచారు.దాతలు :-గురకల వజ్ర ముని, భారత్ సిల్క్ హౌస్ శ్రీ చలపతి, వస్త్రసాగర్ శ్రీ రంగారావు ఉన్నాయి.