డా|| కిషోర్స్ రత్నం పాఠశాలల 5 రోజుల వార్షికోత్సవ వేడుకలలో భాగంగా మూడవరోజు నెల్లూరు నగరంలో డా॥ కిషోర్స్ రత్నం గ్లోబల్ స్కూల్, రత్నం హైస్కూల్ వేదాయపాళెం, రత్నం తీర్ధస్కూల్“పదనిసలు" వార్షికోత్సవమును కస్తూర్బాకళాక్షేత్రములో నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన పాఠశాల డైరెక్టర్లు డా||కె.కృష్ణకిషోర్ వాసంతి కిషోర్లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమమును ప్రారంభించారు.ఈ సందర్భంగా డా|| కృష్ణ కిషోర్ మాట్లాడుతూ అందరికి అందుబాటులో ఉండే విధంగా పోటి ప్రపంచానికి అనుగుణంగా ఇ-ఐఐటి , నీటి ప్రోగ్రామ్స్ ని ప్రధానంగా డా॥ కిషోర్స్ రత్నం విద్యార్థులకుఅందజేస్తున్నామని, థీమాటిక్ సెమినార్స్, సైన్స్ చిల్డ్రన్ కాన్ఫరెన్స్ మొదలైన కార్యక్రమాల ద్వారా విద్యార్ధులలో ప్రతిభను, నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నామని తెలియపరిచారు. అంతేకాకుండా విద్యార్ధులకు సరైన 
స్వయం నిర్ణయాలు తీసుకొనే విధంగా తగినంత ప్రోత్సాహాన్ని కలిగించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ వార్షికోత్సవంలో ప్లే క్లాస్ నుండి 9వ తరగతి వరకు విద్యార్ధులు విభిన్నమైన నృత్యాలను ప్రదర్శించారు. ముఖ్యంగా “స్వాగతిస్తూ గణపతి నృత్యము, మణిపురి నృత్యము, గోపికమ్మ - కృష్ణుల నృత్యము అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు, మేనేజర్లు రాజేష్, అజయ్ సింగ్, రఘురామ్, రవీంద్ర, ఏ.ఓ.లు తుహీన, లక్ష్మీ, రుక్మిణి, సునీల్, ప్రిన్సిపాల్స్ రోహిణి, ఖాసిం, జ్యోతిర్మయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.