సూళ్లూరుపేట, జనవరి 21, (రవికిరణాలు) : సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు నిత్య అన్నదానమునకు నెల్లూరుకు చెందిన శ్రీ కోట శ్రీనివాసరావు దంపతులు రూ. 1,01,116/-లు చెక్కును మంగళవారం ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డిలకు అందజేయుట జరిగినది.ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో వారిని సత్కరించి తీర్ధ ప్రసాదాలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు గోగుల తిరుపాల్,తిరమద్దూరు శారద, కర్లపూడి మదన్ మోహన్,మరియ కళత్తూరు రామ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.