నెల్లూరు, డిసెంబర్‌ 28, (రవికిరణాలు) : కండలేరు ముంపు పునరావాస కేంద్రాన్ని నవరత్నాల కొరకు ఆక్రమించడం దారుణమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిడతల రమేష్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండలేరు జలాశయ ముంపు గ్రామాలైన రేగడపల్లి, దాచూరు గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాన్ని పొదలకూరు మండలం చాటగుట్ల వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ముంపు పునరావాస కేంధ్రాల ఛైర్మన్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేసాల మేరకు 50 ఎకరాలలో ఆర్‌ అండ్‌ ఆర్‌ నిధులతో 490 ప్లాట్లు, రోడ్లను 2017లో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దాచూరు, రేగడపల్లి, రత్నాపురం ముంపు వాసులు తమకు నెల్లూరు నగరంలో ఇంటి ప్లాట్లు కేటాయించమని హైకోర్టులో డబ్ల్యూపి2741/12, 8578/2014 కేసులు వేస్తే చాట్లగుట్లలో ప్లాట్లు కేటాయిస్తూ జిల్లా యంత్రాంగం కోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. హైకోర్టు ఈ ముంపువాసులకు చాటగుట్ల పునరావాస కేంద్రం పై ఆశలు పెంచుకున్నారు. నేడు వైఎస్సార్సిపి నవరత్నాల పథకాల్లో భాగంగా పునరావాస కేంద్రాన్ని రాజకీయ లబ్ది కొరకు స్థానికులకు ఇళ్ళ ప్లాట్లు కొరకు పనులు జెసిబిలతో వేగవంతంగా చేస్తున్నారు. కండలేరు జలాశయం కొరకు గ్రామాలను కోల్పోయిన వారికి ప్రాధాన్యతనిచ్చి, పునరావస చట్టాలను, హైకోర్టు ఉత్తర్వులను గౌరవించి చాటగుట్ల పునరావాస కేంద్రాన్ని యధాతదంగా కొనసాగించాలని బిజెపి విజ్ఞప్తి చేస్తుందన్నారు. కలెక్ట్రర్‌ శ్రీధర్‌ను అన్యులు ఈ పునరావాస కేంద్రలో ప్లాట్లు కోరగా పునరావాస కేంద్రాన్ని ముంపుప్రజలకు మాత్రమే కేటాయించాలని, రాపూరు, పొదలకూరు తహశిల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు యివ్వడం జరిగిందన్నారు. కలెక్టర్లు, ప్రభుత్వాలు మారినపుడల్లా ముంపుప్రజలను ఇబ్బంది పెట్టొద్దని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఓజిలి సుధాకర్‌, వెంకట రమణ,
మువ్వల రాంబాబు, కేశవలు పాల్గొన్నారు.