మీరు పెద్దగా ఏమీ చదవ లేదా....

ఉపాధి కోసం  ఎదురు చూస్తున్నారా.....

పర్వాలేదు....

రాష్ట్ర ప్రభుత్వం మీకు ఉపాధి కల్పించే అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉంది...

 అవును....మీరు చదివింది నిజమే...

రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా మీకు తగిన తర్ఫీదును ఇచ్చి ఉపాధి అవకాశం కల్పించే బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది  కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సూచల మేరకు రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌....

ఈ నెల 30 వ తేది అనగా *30 డిసెంబర్‌ 2021 ఉదయం 9 గంటలు నుంచి కావలి కి సమీపంలో జాతీయ రహదారిపై కడనూతన వద్ద  ఉన్న ఆర్‌.ఎస్‌.ఆర్‌. ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ‘మెగా జాబ్‌ మేళా’ జరుగుతుంది. 

మీరు.... 10 వ తరగతి ఫెయిల్‌ అయినా, పాస్‌ అయినా పర్వా లేదు

అలాగే...ఇంటర్‌మీడియట్ ఫెయిల్‌ అయినా, పాస్‌ అయినా పర్వా లేదు

ఇంకా డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ,...ఇలా ఏ చదువు చదివి ఉన్నా, అందులో ఫెయిల్‌ అయి ఉన్నప్పటికీ చింతించవద్దు. దేశ, అంతర్జాతయ ప్రాముఖ్యత కలిగిన 19  సంస్థలలో 1,200 పైగా ఉద్యోగ అవకాశాలతో ఈ ‘మెగా జాబ్‌ మేళా’ నిర్వహిస్తున్నారు. 


నేరుగా ఆర్‌.ఎస్‌.ఆర్‌. ఇంజనీరింగ్‌ కళాశాలక చేరుకుని స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

 వివరాలకు –70931 51046, 87908 13132 మోబైల్‌ నెంబర్లలో సంప్రదించవచ్చు.

కావలి నియోజకవర్గంలోని పంచాయతీ సర్పంచ్‌లు, ఎంసీటీసీలు, జడ్పీటీసీలు, ప్రాధమిక వ్యవసాయ పరసతి సహకార సంఘాల అధ్యక్షులు, గ్రామ స్థాయి నాయకులు చొరవ తీసుకొని, మీ గ్రామాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న  యువతీ యువకులకు తెలియజేసి ఈ చక్కటి అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.