నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి 

సంగం, డిసెంబర్‌ 26, (రవికిరణాలు) : జగన్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేసుకుని జిల్లా సస్యశ్యామలం అవుతుందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సంగం బ్యారేజీ పనులను జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, గౌతంరెడ్డి లతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో జిల్లాలో ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ విజయం సాధించాక ప్రజల్లో నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే బిల్లులు వస్తాయని కాంట్రాక్టర్ నమ్ముతున్నారని తెలిపారు. అందుకే పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారని తెలిపారు. సంగం బ్యారేజీ సెప్టెంబర్ లోగా పూర్తి చేస్తే అది జిల్లాకు ఎంతో ఉపయోగమే కాకుండా ప్రభుత్వం పై గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. 2500 కోట్లతో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పనులు చేపట్టే విషయంలో పూర్తి స్వేచ్ఛని ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, రూప్ కుమార్ యాదవ్, సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.