గడప గడపకు ఇసుక పాలసీని జిల్లాలో ఎటువంటి అవకతవకలు లేకుండా అందించాలి - యస్పి 
ఎన్ఫోర్స్మెంట్ తదితర విషయాలలో ముందు చూపుగా వ్యవరించాలి
నెల్లూరు, పిబ్రవరి 06, (రవికిరణాలు) : జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ జిల్లా పోలీసు కార్యాలయంలో తెలుగు గంగ ప్రాజెక్ట్ కలెక్టర్(స్యాండ్ స్పెషల్ ఆఫీసర్), డిడి మైన్స్, డిజిఎమ్‌-ఏపిఎమ్‌డిసి మొదలగు మైనింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి పై వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన ఇసుక పాలసీ సత్ఫలితాలను అందిస్తోంది. ఈ పాలసీ ద్వారా వినియోగదారులకు పారదర్శకంగా ఇసుక సరఫరా జరుగుతోంది. ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కంప్యూటర్‌పై స్వల్ప పరిజ్ఞానం ఉన్న వారు కూడా సులభంగా ఇసుక బుక్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించారు. నేరుగా కాకుండా సచివాలయాల నుంచి కూడా బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు.జిల్లాలో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను, ఫలితంగా అక్రమాలకు తావు లేకుండా, అన్ని రీలను తెరవాలని, ఈ మేరకు చెక్ పోస్టుల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే.. అవినీతికి తావులేని, అక్రమ తవ్వకాలకు ఆస్కారం లేని పారదర్శక ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డోర్ డెలివరీ విధానంలో ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాలని ఆదేశించారు. జనరల్, బల్క్ గా వినియోగదారులను విభజించి అధికారులు ఇసుక సరఫరా చేస్తున్నారు. జనరల్ వినియోగదారులు జిల్లాలో ఎక్కడి నుంచి అయినా 'శాండ్.ఏపీ.జీఓవీ.ఇన్' వెబ్ సైట్లో లాగిన్ అయి ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకోవచ్చు. 48 గంటల్లో వారికి ఇసుక కేటాయిస్తున్నారు. రీ లకు వెళ్లి వే బిల్లులు తీసుకుంటే వినియోగదారునికి ఫోన్ ద్వారా సమాచారం అందించి డెలివరీ చేస్తారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యస్పి
తో పాటు తెలుగు గంగ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ ఎస్‌.ఎన్‌.నాగేశ్వర రావు, డిడి మైన్స్ నరసింహా రెడ్డి, డిజిఎమ్‌-ఏపిఎమ్‌డిసి వెంకటరమణ, యస్.బి. డియస్పి యన్.కోటారెడ్డి మైనింగ్ అధికారులు పాల్గొన్నారు.