అల్లూరు పోలేరమ్మ జాతర బందోబస్తును పరిశీలించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు

ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు నడుమ జరుగుతున్న జాతర మహోత్సవ కార్యక్రమం  అన్ని విభాగాల సమన్వయము, స్థానిక నాయకులు, ప్రజల సహకారంతో ప్రశాంతంగా నిర్వహిస్తున్నాము. అనుమానిత వ్యక్తుల వివరాలు, వేలిముద్రల సేకరణకు ప్రత్యెక బృందాలు ఏర్పాటు. విధులలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. భక్తులు తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలి. ప్రవేశం, నిష్క్రమణ ద్వారాల వద్ద బారికేడ్లు ఏర్పాట్లు. పోలీసు వారికి సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి. ఎటువంటి అత్యవసర సహాయమైన పోలీసు వారిని సంప్రదించండి.  నిరంతరం అందుబాటులో ఉంటాము. చుట్టుపక్కల అనామికులతో అప్రమత్తంగా ఉండాలని సూచన..