నెల్లూరు, జనవరి 29, (రవికిరణాలు) : జిల్లాలో ఏర్పాటవుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను వచ్చే నెల మొదటి వారంలోగా ప్రారంభించాలని జిల్లా మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. రైతులకు దీనిపై ఈలోగా విస్తృత ప్రచారం నిర్వహించాలని, అలాగే బ్యాంకు గ్యారంటీ వున్న మిల్లర్లనే ఎంపిక చేయాలని సూచించారు. గతంలో జరిగిన తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతుల అభివృద్ధికి కృషి చేయాలని సమీక్షా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో డిసిఎమ్‌ఎస్‌ ఛైర్మన్ వీరి చలపతిరావు, జెసి వినోద్ కుమార్,జిల్లా సివిల్ సప్లైస్ అధికారి
రోస్మాండ్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.