నెల్లూరు డిసెంబర్ 27:-- 

ఉద్యోగ విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు నూతనంగా నియామక పత్రాలు పొందిన ఉద్యోగులకు సూచించారు.  సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ మృతి చెందిన ఉద్యోగుల వారసులకు  కారుణ్య నియామక పత్రాలు అందజేశారు.  అందులో మోహిత్ బాబు  స్త్రీ శిశు సంక్షేమ శాఖ కు జూనియర్ అసిస్టెంట్ గా, జయ కృష్ణ రిజిస్ట్రేషన్ శాఖకు  జూనియర్ అసిస్టెంట్ గా,  ఎం భాను ప్రకాష్ జూనియర్ అసిస్టెంట్ గా,  సుభాని ఆఫీస్ సబార్డినేట్ గాఆడిట్ శాఖకు  కేటాయించబడినారు.  ఈ కార్యక్రమంలో  సంయుక్త కలెక్టర్ లు శ్రీహరెందిర ప్రసాద్,  శ్రీ గణేష్ కుమార్, శ్రీ విదెహ్ ఖరే, డి ఆర్ ఓ శ్రీ చిన్న ఓబులేసు, ఏ ఓ శ్రీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.