ఇటీవలి వరద బాధితులకు కొనసాగుతున్న నెల్లూరు రెడ్ క్రాస్ సహకారం

7 విడతలో నేడు 110 కుటుంబాలను ఆదుకున్న రెడ్ క్రాస్

నెల్లూరు రెడ్ క్రాస్ సేవలను అద్భుతమని ప్రశంసించిన జిల్లా కలెక్టర్...

మానసిక దివ్యంగులు అయిన స్పాస్టిక్ సెంటర్ విద్యార్థులOదరకీ దగ్గరుండి భోజనం వడ్డీంచిన కలెక్టర్ గారు..


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇటీవల సంభవించిన తుఫాను మరియు వరద బాధితులకు సహాయార్థం పూర్తిగా దెబ్బతిన్న గంగపట్నం కి చెందిన 80  గిరిజన కుటుంబాలకు మరియు భగత్సింగ్ కాలనీ కి చెందిన 30 కుటుంబాలకు నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కలెక్టర్ శ్రీ కె.వి.యన్ చక్రధర్ బాబు, IAS గారిచే ఈ రోజు నిత్యావసర సరుకులను మరియు టార్పాల్లిన్ పట్టలను ఇవ్వడం జరిగినది. 

ఈ సందర్భంగా  కలెక్టర్ శ్రీ కె.వి.యన్ చక్రధర్ బాబు, IAS గారు మాట్లాడుతూ నెల్లూరు లో సంభవించిన వరదలకి పూర్తిగా నేలమట్టమైన ఇళ్లను నెల్లూరు రెడ్ క్రాస్ ద్వారా  నిత్యవసర వస్తువులు ఏర్పాటు చేయడం చాలా సంతోషం గా వుందని తెలియచేశారు. అలానే కరోనా సమయంలో కూడా నెల్లూరు జిల్లా శాఖ చేసిన సేవలకు గాను చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ని అభినందించారు. నెల్లూరు రెడ్ క్రాస్ చేస్తున్న సేవలు కేవలం మన రాష్ట్రం లోనే కాక దేశం లోనే అత్యున్నత స్థానంలో ఉన్నాయని అన్ని జిల్లాలకు నెల్లూరు రెడ్ క్రాస్ ఆదర్శం అని కొనియాడారు.

రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే నెల్లూరు లోని వరదల్లో చిక్కుకున్న నిరాశ్రయులకి మరియు పూర్తిగా  నేలమట్టమైన ఇళ్లకు గత నెలనుండి రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ వారు  టార్పాలిన్ పట్టలు, దుప్పట్లు, వంట సామ్రాగ్రీ, దోమ తెర మొదలగునవి ఇవ్వడం సంతోషంగా ఉందని తెలియచేసారు.

రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న MSR  స్పాస్టిక్ సెంటర్ లో మానసిక దివ్యాంగులు అయిన విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న భోజన పథకం లో భాగంగా నేడు జిల్లా కలెక్టర్ గారు అందరకీ స్వయంగా భోజనం వడ్డించారు 

అకస్మాత్తుగా సంభవించిన ఈ అకాల వరదలు నెల్లూరు మరియు కోవూరు  పట్టణాలు మరియు పరిసర ప్రాంతాల గ్రామాలను ముంచెత్తి పూర్తిగా ఇళ్లను నేలమట్టం చేశాయి. వందలాది ఇల్లు పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయాయి.

 ఆ సమయాలలో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పునరావాస కేంద్రాలను చేరుకొని ప్రాణాలను కాపాడుకోవలసిన  పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కుటుంబాలకు  రెడ్ క్రాస్ తరుపున సహాయం చేయడం తృప్తిగా ఉందని తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా శాఖ  కోశాధికారి శ్రీ సురేష్ కుమార్ జైన్, రాష్ట్ర రెడ్ క్రాస్  మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్, శ్రీ గునపాటి ప్రసాద్ రెడ్డి,  శ్రీ గంధం ప్రసన్నాంజనేయులు, శ్రీ బయ్యా ప్రసాద్,  కన్వీనర్లు శ్రీ సీ.హెచ్ అజయ్ బాబు, శ్రీ మురళి క్రిష్ణ, కో-కన్వీనర్లు శ్రీ రవీంద్ర రెడ్డి,, శ్రీమతి సురేఖ, రేడ్ క్రాస్ స్టేట్ కో- ఆర్డినేటర్ శ్రీ గంటా వెంకట రవి కుమార్, రెడ్ క్రాస్ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.