స్పందన అర్జీల  పరిష్కారంలో నాణ్యతను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కే వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.  సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణం లో కలెక్టర్ " స్పందన కార్యక్రమం"  నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1708  పరిష్కారమైన అర్జీలు మరలా వచ్చినాయన్నారు.  అర్జీలు పరిష్కరించే విషయంలో అర్జీదారులకు వారు కోరిన విధంగా ఎందుకు చేయలేక పోతున్నామో వారికి అర్థమయ్యే విధంగా కారణాలు  తెలియజేయాలని స్పష్టం చేశారు.  ఒకే  అంశంపై పదే పదే అర్జీలు  రావడం సరైంది కాదని సూచించారు.  ప్రధానంగా గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాలు,డి ఆర్ డి ఎ,  రెవిన్యూ సీసీఎల్ఏ,  పోలీసు, పంచాయతీరాజ్ పురపాలక పరిపాలన , పౌరసరఫరాలు, మెప్మా పరిధిలో అర్జీలు మరలా వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు

ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ వారం సుపరిపాలన  వారోత్సవాలను జరుపుకుంటున్నా మన్నారు. ప్రతి పౌరుడికి ప్రభుత్వ పథకాలు సునాయాసంగా చేరేలా ప్రతి ప్రభుత్వ శాఖ అవకాశం కల్పించాలన్నారు. అలాగే సకాలంలో ప్రజల అర్జీలను పరిష్కరించాల్సి ఉందన్నారు. జవాబుదారీతనంతో ఉద్యోగ విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి లక్షణాలన్నీ స్పందన కార్యక్రమం లో కన పరచాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న అన్ని అర్జీలను వచ్చే సంవత్సరానికి కొనసాగించకుండా ఈ వారంలోనే వాటన్నిటిని నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించి పరిష్కరించాలన్నారు. 

 జిల్లాలో 111 స్పందన అర్జీలు గడువు దాటి ఉన్నాయని ప్రధానంగా మున్సిపల్,  రెవిన్యూ, రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖలో పౌరసరఫరాలు, ప్రకృతి వైపరీత్యాలు  యాజమాన్య విభాగంలో  పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటన్నిటిని కూడా ఈ వారంలో గా పరిష్కారం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

గృహ నిర్మాణం:

అన్ని కార్యక్రమాలలో కెల్లా గృహ నిర్మాణ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్  అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం గృహ నిర్మాణానికి సంబంధించిన నిధులు విడుదల అవుతాయని, ఎవరు మొదట బిల్లులు   క్లెయిమ్  చేస్తారో వారికి ఆ నిధులు వస్తాయన్నారు. ఇళ్ల లబ్ధిదారులను మరింతగా ప్రోత్సహించి వచ్చే ఉగాది నాటికి గృహప్రవేశాలకు అందరినీ సంసిద్ధం చేయాలన్నారు.  ప్రత్యేక అధికారులు ప్రతిరోజు ఇళ్ల నిర్మాణం పురోగతిని సమీక్షించాలన్నారు. డి ఆర్ డి ఎ, మెప్మా రుణాలు అందించడంతోపాటు గృహ నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంటు, ఇనుము తదితర ముడి సామాగ్రిని కూడా సమకూర్చే లాగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం అనుకున్న రీతిలో పూర్తి చేసేందు కోసం  ప్రతి వారము గృహ నిర్మాణం దశలవారీగా జరిగే విధంగా అందుకనుగుణంగా ఖర్చు జరిగే లాగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఓ టి ఎస్ పథకం:

జిల్లాలో ఇప్పటి వరకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్టైమ్ సెటిల్మెంట్ ( ఓ.టి.ఎస్) కార్యక్రమం కింద 51 శాతం పూర్తయిందని, మిగిలిన లక్ష్యాన్ని కూడా అన్ని మండలాల్లో వీలైనంత త్వరగా  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు  క్షేత్రస్థాయిలో  విస్తృతంగా పర్యటించి అన్ని ప్రభుత్వ శాఖలతోసమన్వయం చేసుకొని మండల స్థాయిలో గృహ నిర్మాణం తదితర అన్ని ప్రభుత్వ  పథకాల అమలుపై సమీక్ష జరపాలన్నారు.  జులై నుండి డిసెంబర్ వరకు అన్ని ప్రభుత్వ పథకాలు ఈనెల 28వ తేదీన విడుదలవుతున్నాయన్నారు.  ఇంకా లబ్ధి పొందనివారు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే వారు దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపాలన్నారు.

ఉపాధి హామీ పథకం:

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నిర్మాణం చేపట్టిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, హెల్త్ క్లినిక్ లు,పాల శీతలీకరణ కేంద్రాల అన్ని  భవనాలు త్వరితగతిన పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అక్షర చైతన్యం:

జిల్లాలో  వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శులు ప్రతిరోజు సాయంత్రం నిరక్షరాస్యులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి అక్షరాస్యులుగా చేసే అక్షర చైతన్యం  కార్యక్రమాన్ని వినూత్నంగా ఆగస్టులో ప్రారంభించామని, వచ్చే జనవరి మాసం తో  ముగియనుందన్నారు. ప్రభుత్వ పథకాలు అమలులో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి వచ్చే సంవత్సరం జనవరి 26 వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రశంసా పత్రం అందజేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో

 సంయుక్త కలెక్టర్లు శ్రీ హరెందిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీ విదేహ్ ఖరే, శ్రీమతి రోస్ మాండ్, డి ఆర్ ఓ శ్రీ చిన్న ఓబులేసు,  జెడ్ పి  సీఈవో శ్రీ శ్రీనివాసరావు, టిజిపి ప్రత్యేక కలెక్టర్ శ్రీ నాగేశ్వరరావు, కె ఆర్ ఆర్ సి. ఎస్ డి సీ శ్రీ దాసు, డిఆర్డిఎ డ్వామా పీడీలు శ్రీ సాంబశివారెడ్డి, శ్రీ తిరుపతయ్య, పంచాయతీరాజ్, జలవనరులు,  విద్యుత్ శాఖల ఎస్. ఈ లు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ కృష్ణ మోహన్, శ్రీ విజయ్ కుమార్ రెడ్డి తదితర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.