ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుండి ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, జాయింట్ కలెక్టర్  డాక్టర్ ప్రభాకర్ రెడ్డి లు మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు... ఈ కార్యక్రమంలో కె వి చలమయ్య ముదిగొండ శ్రీనివాసులు తోపాటు పలువురు ఆర్యవైశ్య సంఘ నేతలు పాల్గొన్నారు