వైఎస్సాఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగంగా దేవరపాలెం గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందజేసారు. గ్రామవాలంటీర్లతో కలిసి వెళ్లి, లబ్దిదారులను పరామర్శించి, ప్రభుత్వ పధకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలియజేశారు.