సూళ్లూరుపేట,జనవరి 8, (రవికిరణాలు) : సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని బాపూజీ కాలనీ నందు బుధవారం వృద్ధుల అయినటువంటి తురకనమ్మ, ఖలీల్ బాయ్ లకు ఎస్‌ఆర్‌కెపిఎస్‌ఎస్ సభ్యుల ఆధ్వర్యంలో నెల రోజులకు సరిపడే సరుకులను అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలు ఉషా మాట్లాడుతూ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల అడుగుజాడల్లో నడుస్తున్నమని తెలియచేసారు.జనవరి 12 స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు క్రీడలు మహిళలకు ముగ్గుల పోటీలు పిల్లలకు దేశభక్తి పాటలు, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కృష్ణారెడ్డి,కార్యదర్శి నరేష్ బాబు, చాందిని, ముని రత్నమ్మ, రాజశేఖర్, చెంచెయ్య తదితరులు పాల్గొన్నారు.