సూళ్లూరుపేట,జనవరి 7, (రవికిరణాలు) : సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని సాయి నగర్ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల నందు మంగళవారం ఆచార్య భరద్వాజ సేవాసంస్థ సూళ్ళూరుపేట వారు గత రెండు సంవత్సరాలు గా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించి విద్యార్థులకు నూతన వస్త్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆచార్య భరద్వాజ సేవాసంస్థ సభ్యులు, ఉపాధ్యాయులు కామాక్షమ్మ,ఉషారాణి, పిఎమ్‌సి చైర్మన్ పద్మ, గంగోత్రి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.