నెల్లూరు, జనవరి 07, (రవికిరణాలు)  : నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన ఎస్.వెంకటసుబ్బమ్మ, 10వ డివిజన్ ఉస్నాన్ సాహెబ్ పేటకు చెందిన టి.వెంకటకృష్ణారావు, 15వ డివిజన్ మసీదువీధికి చెందిన ఎస్.కె.రహమతున్నీసా, ఎం.డి.ఫర్హాన్, 40వ డివిజన్ మూలాపేటకు చెందిన ఆళ్ళపాక సుజాత, వి.సత్యనారాయణ, 9వ డివిజన్ నవాబుపేటకు చెందిన టి.ఆనందరావు, చుండి అంజలి, మన్నెం సురేన్లు ఆరోగ్యం సరిగా లేనందున రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా॥ పి.అనీల్‌కుమార్‌ను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి ఏర్పాటు చేయాలని కోరగా, వెంటనే మంత్రి అనీల్ కుమార్ స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎన్. మెకటసుబ్బమ్మకు 75 వేలు, టి.వెంకటకృష్ణారావుకు 50 వేలు, ఎస్.కె. రహమతున్నీసాకు 90 వేలు, ఎండి ఫర్హాన్‌కు 45 వేలు, ఆళ్ళపాక సుజాతకు 70 వేలు, వి.సత్యనారాయణకు 1 లక్ష,
టీ.ఆనందరావుకు 2.25 లక్షలు, చుంది అంజలికి 40 వేలు, మన్నెం సురేష్ కు 1.40 లక్షలు విడుదల చేయించగా, బాధితులకు వైఎస్ఆర్ సిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పి.రూప్‌కుమార్‌ యాదవ్‌ వైఎస్ఆర్‌సిపి నాయకులు సన్నపరెడ్డి పెంచలరెడ్డితో కలిసి రాజన్నభవన్లో చెక్కులను అందజేశారు.రూప్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని అనేకమంది పేదలు ఆరోగ్యం బాగాలేక అనేక ఇబ్బందులు పడి ఆసుపత్రులలో చికిత్స పొంది వారి వారి సమస్యలను నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి అనీల్ కుమార్‌కు చెప్పుకోగా, అందుకు స్పందించిన ఆయన 9 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి
సహాయనిధి నుంచి బాధితులకు చెక్కుల రూపేణా అందజేయడం జరిగిందన్నారు. ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యశ్రీ ద్వారా మంజూరు కాని వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇప్పటివరకు లక్షల రూపాయలు అందించడం జరిగిందన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన అనీల్‌ కుమార్‌కు మంత్రి పదవి వచ్చినప్పటికీ వారానికి 2, 3 రోజులు జిల్లాలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మంత్రి అనీల్ కుమార్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానన్నారు.సన్నపురెడ్డి పెంచలరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక మంత్రి అనీల్ కుమార్‌ను కలిసి సమస్యలను చెప్పుకోగా, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అనేకమంది బాధితులకు లక్షల రూపాయలను అందించడం జరిగిందన్నారు. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలతోపాటు ప్రజలకు నేనున్నానంటూ అండగా నిలబడుతున్న మన నాయకుడు, మంత్రి అనీల్ కుమార్ అని తెలియజేస్తున్నానన్నారు. ప్రజలందరూ మంత్రి అనీల్‌ కుమార్‌ను ఆదరించి, ఆశీర్వదించాలని, అలాగే ఎవరికి ఏ పని అవసరమైనా నిష్పక్షపాతంగా చేసేందుకు కృషి చేస్తారన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు ఓబిలి రవిచంద్ర, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ఉప్పాల శేషుగౌడ్, ఊటుకూరు నాగార్జున, గణేశం వెంకటేశ్వర్లురెడ్డి, పొడమేకల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.