నెల్లూరు, జనవరి09, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొదలకూరు రోడ్డు జడ్పీ హైస్కూల్ ఏర్పాటు చేసిన వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలను అందజేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పథకం ప్రజలకు అందజేస్తూ విద్యావ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసారు. విద్యావ్యవస్థలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను అమ్మబడి, ఇంగ్లీష్ మీడియంలో బోధన, మనబడి నాడు-నేడు, మధ్యాహ్న భోజన పథకం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అంటూ అనేక పథకాలను విద్యా వ్యవస్థలో ప్రవేశపెడుతూ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తెలియజేశారు.