కోట, జనవరి 04, (రవికిరణాలు) : కోట పట్టణంలో గత మూడు రోజులుగా ఐడియా సేవలు పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, కేవలం ఐడియా నెట్ మాత్రం పనిచేస్తున్నాయి, ఔట్ గోయింగ్, ఇన్ కమింగ్ కాల్స్ అసలు పనిచేయడం లేదు. ఐడియా సిమ్ ను వినియోగిస్తున్న వినియోగదారుల పరిస్థితి అగోమ్యచరణం గా మారింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారుల పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఐడియా కస్టమర్ కి కాల్ చేయాలన్న వీలులేని పరిస్థితులు, అసలు ఐడియా సేవలు కోటలో మాత్రమే పనిచేయడం లేదు. ఎందువల్ల ఐడియా సేవలు నిలిపివేశారు అనే విషయం  వినియోగదారులకు తెలియజేయలన్న ఇంగిత జ్ఞానం కూడా ఐడియా యజమానులకు లేకపోవడం ధౌబాగ్యం అనీ వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐడియా సేవలు మూడు రోజులు గా నిలిపివేశారు.వీటిపై సంబంధిత అధికారులు  చొరవ తీసుకుని వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. అర్ధంతరంగా ఐడియా సేవలు నిలిపివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.