కోవూరు, జనవరి 29, (రవికిరణాలు) : కోవూరు మండలం పోతిరెడ్డి పాళెం పంచాయతీ తిప్పగిరిజన కాలనీలో గిరిజనులు రెండు నెలలుగా త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.ఈవిషయాన్ని మహిళలు అధికారులు దృష్టికి తీసుకెల్లారు అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.దీనిపై బుధవారం యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో ధర్నా జరుగుతుంది. సమస్య పరిష్కరించే వరకు ఇక్కడనుంచి కదిలేదని అధికారులుకు చెప్పడమైనదని ధర్నా కొనసాగుతోంది.
 ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య,జిల్లా అధ్యక్షుడు బియల్ శేఖర్,కోవూరు మండలం,గౌరవ అధ్యక్షులు ఏలూరి చెంచురామయ్య, మండల కార్యదర్శి మానికల మురళీ,మానికల సుబ్రమణ్యం,పోట్లూరు రోజ,గ్రామస్తులు పాల్గొన్నారు.