ప్రభుత్వ జీవో ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా  కావలి పట్టణంలో ప్రభుత్వ స్థలాల లో నివసించే పేదలకు ప్రభుత్వ జీవో 225 ప్రకారం నివాసముంటున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని ఈ రోజు ఆర్డిఓ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లో ధర్నా చేయడం జరిగింది. అనంతరం ఆర్డీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 

ఈ సందర్భంగా నెల్లూరు మాజీ డిప్యూటీ మేయర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన 225 జీవో ప్రకారం కావలి పట్టణంలో చెరువు కట్ట గిరిజన కాలనీ, వెంగళరావు నగర్, తుఫాన్ నగర్ ఇంకా మరి కొన్ని ప్రాంతాలలో నివసించే పేదలందరికి పట్టాలు ఇచ్చి గట్టి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకుని వందలాది మంది పేద ప్రజలు నివాసం ఉంటున్నారని వారు ఉంటున్న స్థలానికి ఉచితంగానే ప్రభుత్వం పట్టాలివ్వాలని 75 గజాలు స్థలం మాత్రమే ఉచితంగా ఇస్తామని ఆపైన డబ్బులు కట్టాలి అని అధికారులు చెప్పడం ధనవంతులకు మేలు చేసి పేదలకు అన్యాయం చేయడమే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజన్న పేదల పాలన అని చెబుతుందని నిజంగా రాజన్న పాలన ఐతే పేదల దగ్గర డబ్బులు వసూలు చేసి ఖజానా నింపుకోవడమేనా అని అన్నారు. నిరుపేదల అందరికీ ఉచితంగానే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలందరు సమైక్యంగా పోరాడి సమస్యలు పరిష్కరించుకోవలని పిలుపునిచ్చారు. ఈ పోరాటాల లో సీపీఎం పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి P. పెంచలయ్య నాయకులు స్.వెంకయ్య, SK. అమీర్ బాషా, వై.కృష్ణ మోహన్, పెంచల నరసింహం, DYFI నాయకులు D. శ్రీను, కె.చెన్నయ్య గిరిజన సంఘ నాయకులు P. సుబ్రహ్మణ్యం తో పాటు పేదలు ఎక్కువమంది పాల్గొన్నారు.