తడ,జనవరి 6 (రవికిరణాలు) : తడ మండల పరిధిలోని వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా తడ కండ్రిగలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలో పాల్గొన్నారు. ప్రజల దర్శనార్థం విశేషాలంకరణతో ఉన్న స్వామివారిని భక్తుల గోవిందా నామాలు మధ్య స్వామిని దర్శించుకొని
వచ్చారు.అనంతరం మేళతాళాల మధ్య రంగ రంగ వైభవంగా గ్రామ పురవీధుల మధ్య స్వామి వారి ఊరేగింపు జరిపారు. తడ నిప్పో కంపెనీ వారిచే ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయం ధర్మకర్త గౌరీ గ్రామ పెద్దలు భక్తులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.