గతంలో ఇచ్చిన పట్టా స్థలాలు నివాసయేగ్యంగా లేక రోడ్డు మార్జిన్ లో నివసిస్తున్న పేదల ఇళ్ల స్థలాలను రద్దు పరచి,కొత్త గా ఎకరాలు పొలాలు ఉన్న వారికి పంచడం ను వ్యతిరేకిస్తూ మనుక్రాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు,నిరాశ్రయులు కలసి చేస్తున్న ఈ దీక్ష 3 వ రోజు కి చేరుకున్నా అధికారులతో ఎటువంటి స్పందన లేదు. తమకు న్యాయం చేయకుండా స్థలాలు పంపిణీ జరగనివ్వం అంటూ రేయింబవళ్లు స్థలాల వద్ద బాదితులు దీక్షలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఇన్ఛార్జ్ శ్రీనివాసులు రెడ్డి,యూత్ వింగ్ ఇన్ఛార్జ్   విభాగం నాయకులు గునుకులకిషోర్,సుధీర్ బద్దెపూడి,ప్రశాంత్,పవన్,షాజహనన్,శశాంక్ తదితరులు పాల్గొన్నారు.