మర్రిపాడు మండలం ప్రజలకు మర్రిపాడు రెవెన్యూ శాఖ తరపున ముందస్తుగా డి టి అనిల్ కుమార్ యాదవ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మండలం లో కరోన వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు లేవని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు ఈ ఏడాది వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఇళ్లలోనే జరుపుకోవాలని ఆయన సూచించారు. పూజ సామాగ్రికి బయటికి వచ్చిన ఎడల మాస్కు ధరించి, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరారు. చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.