కరోనా వైరస్ పై అపోహలు వద్దు - నివారణా మార్గమే ముద్దు అని యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారిణి సెట్నెల్ సిఈఓ ఎం. సుస్మిత పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులోని బాలాజీ నగర్ నుండి చిల్డ్రన్స్ పార్క్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సి ఈ ఓ ఎం. సుష్మిత, నెల్లూరు నగర ట్రాఫిక్ డిఎస్పి పి. మల్లికార్జునరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ కరోనా వైరస్ పై ప్రజలలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర ట్రాఫిక్ డిఎస్పి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. కరోనా వైరస్ గురించి తెలుసుకుందాం.. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిద్దాం.. కరోనా వైరస్ గబ్బిలాలలో ఉన్న కరోనా వైరస్, పాములలో ఉన్న కరోనా వైరస్ తో కలవడం వలన ఈ ఏడవరకం కరోనా వైరస్ ఉద్భవించింది. ఈ వైరస్ చైనాలో భయాందోళనలు కలిగిస్తునప్పటికీ కూడా.. ఈ వైరస్ సోకిన వారందరూ చనిపోరు, అప్రమత్తంగా ఉండటమే సరైన మార్గమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.. ప్రిన్సిపల్ కె ఎస్ వి కిరణ్ కుమార్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మురికిపూడి సతీష్ కుమార్, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మురళీమోహన్ రాజు, డీన్ శ్రీనివాసులు, టి. వెంకటేశ్వర్లు, రవి గోగులపల్లి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.